పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పసుపులేటి మహాలక్ష్మిరావు & ఇళ్ల సత్యనారాయణ

July 30, 2026 | ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 5న చేనేత సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం*

పయనించే సూర్యుడు జూలై 30 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)అమలాపురంభారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యాలయంలో గురువారం ఓబీసీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీన నిర్వహించ నున్న రాష్ట్ర స్థాయి చేనేత సమ్మేళనం పోస్టర్‌ను ఓబీసీ మోర్చా బృందంతో కలిసి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి మహాలక్ష్మి రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఓబీసీ మోర్చా పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 8 గంటల నుంచి ర్యాలీ ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగుతుందని అన్నారు. అనంతరం 9.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త సమయపాలన పాటించాలని కోరారు.ఇటీవల జిల్లాలో నిర్వహించిన ఓబీసీ మోర్చా సమావేశాన్ని విజయవంతం చేసినట్లుగానే ఆగస్టు 5న నిర్వహించ నున్న చేనేత సమ్మేళనాన్ని కూడా ఘన విజయం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, చేనేత వర్గాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.చేనేత రంగం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, చేనేత కార్మికుల సంక్షేమం మరియు అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత సమ్మేళనం చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించే వేదికగా నిలుస్తుందని తెలిపారు.జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని ఆగస్టు 5న జరిగే రాష్ట్ర స్థాయి చేనేత సమ్మేళనాన్ని ఘన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాజులూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జక్క శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ సమన్వయకర్త ఇళ్ల సత్యనారాయణ, పావులూరి వెంకట్, కట్ట జనార్ధన్, సమాస ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper