PS Telugu News
Epaper

ఒక్క మాటతో మొత్తం కథ మారింది: దాచిన నిజాలు బయటపడటంతో అందరికీ షాక్!

📅 24 Nov 2025 ⏱️ 10:55 AM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఐబొమ్మ రవి డే-4 కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ఒక్కడినే అంతా చేశానని పోలీసులకు చెప్పాడు రవి. స్వయంగా తానే వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశానన్నాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాలు అప్‌లోడ్‌ చేశానని ఒప్పుకున్నాడు. పైరసీ కేసులో ఐదుగురి అరెస్ట్‌తోనే అలెర్ట్‌ అయ్యానన్న రవి.. వెంటనే నెదర్లాండ్స్‌ వెళ్లినట్లు తెలిపాడు. అరెస్ట్‌ను ముందే పసిగట్టి హార్డ్‌ డిస్క్‌లలో సినిమాలు మినహా మిగతా డేటా మొత్తం డిలీట్‌ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. అంతేకాదు బ్యాంక్ ఖాతాల్లో డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు. సర్వర్, వెబ్‌సైట్‌ వివరాలను మాయం చేశాడు. అలాగే పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. విదేశాల్లోని సర్వర్ల ద్వారా రవి పైరసీ నెట్‌వర్క్‌ను నడిపినట్లు తెలిపారు పోలీసులు. నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో ఐపీలు ఉన్నట్లు తేల్చారు. ఆ ఐపీలను ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో గుర్తిస్తామన్నారు. అలాగే రవి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడ్డాడని… ప్రతి ఇరువై రోజులకోసారి ఫారిన్‌ ట్రిప్‌కు వెళ్లేవాడని స్పష్టం చేశారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్‌, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలకు రవి ట్రిప్‌కు వెళ్లాడన్నారు. అలాగే వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడని వెల్లడించారు. రవి కరేబియన్‌ పౌరసత్వం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రవి బ్యాంక్ ఖాతాలో రూ. 3.5 కోట్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో, విశాఖలోనూ విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు.

Scroll to Top