PS Telugu News
Epaper

భారతీయ పౌరుడిని కెనడా దేశనిర్బంధం— కారణం ఏంటి?

📅 24 Nov 2025 ⏱️ 12:13 PM 📝 క్రైమ్-న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :తన మనవడిని చూసేందుకు ఆరు నెలల విజిటింగ్ వీసాపై కెనడాకు వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి ఆదేశ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వ్యక్తి కెనడా నుంచి బహిష్కరిస్తూ.. మరోసారి వాళ్ల దేశానికి రాకుండా అతని ప్రవేశాన్ని నిషేధించింది. ఇంతకు కోర్టు అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే.. మీరు షాక్ అవుతారు.ఇతర దేశాలకు వెళ్లిన కొందరు వ్యక్తులు.. అక్కడ చేయరాని పనులు చేసిన మన దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది..ఆరు నెలల విజిటర్ వీసాపై కెనడాకు వెళ్లిన 51 ఏళ్ల భారతీయ వ్యక్తి, ఓ స్కూల్‌ ముందు ఇద్దరు టీనేజ్ బాలికలను వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతన్ని కెనడా నుంచి బహిష్కరిస్తూ తీర్పు ఇచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్ కెనడాలోని ఒంటారియోలో ఉంటున్న తన మనవడి దగ్గరికి వెళ్లిన తర్వాత.. తను ఉంటున్న సర్నియా ప్రాంతంలోని స్థానిక ఉన్నత పాఠశాల పక్కనున్న ఒక కొట్టు దగ్గరకు వెళ్లి తరచూ సిగరెట్‌ కాల్చుతుండేవాడు.. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కెనడియన్ బాలికలు, యువతులపై వేధింపులకు పాల్పడేవాడని. వారి వెంట పడుతూ ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తూ.. వారితో డ్రగ్స్, మద్యం గురించి మాట్లాడేవారని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 16న లైంగిక వేధింపుల ఆరోపణలతో సింగ్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే రెండ్రోజు తర్వాత సింగ్‌ మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చాడు.. కానీ అదే రోజు అతన్ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తర్వాత అతన్ని మళ్లీ కోర్టులో హాజరుపర్చగా.. ఈ రకమైన ప్రవర్తనను సహించమని జస్టిస్ క్రిస్టా లిన్ లెస్జ్జిన్స్కీ పేర్కొన్నారు. డిసెంబర్ 30న భారతదేశానికి తిరిగి రావడానికి అతనికి టికెట్ ఉందని సింగ్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై స్పందిస్తూ సింగ్‌ను దేశం నుండి బహిష్కరించాలని, కెనడాలోకి మరోసారి రాకుండా అతని ప్రవేశాన్ని నిషేధించాలని కోర్టు ఆదేశించింది.


Scroll to Top