PS Telugu News
Epaper

ముగిసిన జీ20 సదస్సు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన కీలక అంశాలు

📅 24 Nov 2025 ⏱️ 1:12 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జీ20 దేశాధినేతల సదస్సు ముగిసింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌‌లో జరిగిన జీ20 సదస్సు తర్వాత మోదీ తిరిగి భారతదేశానికి పయనమయ్యారు.ఈ మేరకు జీ20 సదస్సులో తమ సమావేశాలను, ప్రపంచ నాయకులతో భేటీలను విజయవంతంగా ముగించుకుని  ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలో తన అధికారిక పర్యటనను ప్రారంభించగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్, డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో ఇవేలా, ఇథియోపియా ప్రధాని అభియ్ అహ్మద్ అలీ, ఐఎమ్ఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సహా పలువురు ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు.ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో పలు కీలకమైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. చివరి రోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని భేటీ అవ్వగా.. ఉగ్రవాదంపై చర్చించారు. వారికి నిధులు చేరకుండా అడ్డుకునేలా పోరాటం చేయాలనే విషయంపై చర్చలు కొనసాగాయి. అంతేకాకుండా క్లిష్టమైన ఖనిజాలు, ఏఐతో పాటు ఇతర రంగాలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక కేంద్రీకృతం, జాతీయ, ప్రత్యేకమైన స్వభావం కల సాంకేతికతకు బదులుగా  మానవ కేంద్రీకృతం, ప్రపంచ, ఓపెన్-సోర్స్ సాంకేతికతను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. డిజిటల్ చెల్లింపులు, అంతరిక్ష సాంకేతికత, ఏఐ వంటి రంగాల్లో విస్తృత భాగస్వామ్యంపై చేస్తున్న కృషిని వివరించారు.ఏఐపై భారతదేశ విధానం మూడు స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. ఇందులో సమాన ప్రాప్యత, జనాభా స్థాయి నైపుణ్యం, బాధ్యతాయుతమైన విస్తరణ ఉన్నాయి. ఫిబ్రవరి 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ప్రపంచ నాయకులకు స్వాగతం పలకడానికి భారత్ ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఫిబ్రవరి 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ప్రపంచ నాయకులకు స్వాగతం పలకడానికి భారత్ ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

Scroll to Top