PS Telugu News
Epaper

కుటుంబాన్ని కుదిపేసిన ఘటన—వీసా ఇబ్బందులతో బాధపడిన యువ డాక్టర్ మృతి

📅 24 Nov 2025 ⏱️ 2:25 PM 📝 క్రైమ్-న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అమెరికా J1 వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపానికి గురై హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసిన ఆమెకు వీసా నిరాకరించడంతో కలత చెంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారు. ఈ విషాద ఘటన వీసా నిరాకరణల మానసిక ప్రభావంపై చర్చకు దారితీస్తోంది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.అమెరికా J1వీసా రాలేదన్న మనస్తాపంతో యువ డాక్టర్‌ సూసైడ్‌ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరుకి చెందిన యువ డాక్టర్‌ రోహిణి కొంతకాలంగా హైదరాబాద్‌ నగరంలో నివాసముంటున్నారు. ఆమె రష్యాలో వైద్య డిగ్రీ పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఉన్నత చదువుల కోసం ఇటీవల వీసాకు అప్లై చేయగా.. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో రిజెక్ట్‌ అయినట్టుగా తెలిసింది. గత ఏడాది కాలంగా తాను అమెరికా వెళ్లేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. విదేశాలలో ఉండేందుకు అవసరమైన శిక్షణ, సాధన కోసం భారీగా ఖర్చు చేసి అన్ని ప్రాక్టీస్‌లు చేసింది.కానీ, వీసా రాకపోవడంతో కలత చెందిన రోహిణి నిద్రమాత్రలు వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్నికుటుంబ సభ్యులు గుంటూరులోని తమ స్వస్థలానికి తరలించారు. ఎక్కువ మొత్తంలో స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకోవడం వల్లే రోహిణి మరణించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. J-1 వీసా అనేది ఆమోదించబడిన సాంస్కృతిక, విద్యా లేదా వృత్తిపరమైన కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తులకు ఇవ్వబడే US ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసా. ఇది విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, కొన్ని ట్రైన్సింగ్‌ కోర్సులు, ఇంటర్న్‌లు, డాక్టర్స్ మొదలైన వారిని తాత్కాలికంగా యునైటెడ్ స్టేట్స్ వెళ్లడానికి అనుమతిస్తుంది. ఇది వర్క్ వీసా కాదు, కానీ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా కొంత పనికి అనుమతి ఉంది.


Scroll to Top