PS Telugu News
Epaper

ఇరుముడితో శబరి యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

📅 24 Nov 2025 ⏱️ 3:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ న్యూస్ నవంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల దీక్షను పూర్తిచేసుకుని కూకట్పల్లి అయ్యప్ప స్వామి దేవస్థానం లో ప్రధాన అర్చకులు యోగేశ్వర శర్మతో ఇరుముడి పట్టించుకున్న శ్రీనివాస్ రెడ్డి గురు స్వామి సన్నిధానం స్వాములు శ్రీధర్ శ్రీకాంత్ నారాయణ అభినవరెడ్డి స్వాములు శబరిమల దైవ దర్శన యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఇరుముడి పూజ కార్యక్రమాన్ని అభినందించి శబరి యాత్రకు సంతోషంగా వెళ్లి అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలగాలని కోరుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు యోగేశ్వర శర్మ మాట్లాడుతూ ఇరుముడి అనేది అయ్యప్ప దీక్షలో భాగంగా భక్తులు శబరిమల యాత్రకు తీసుకెళ్లే ఒక పవిత్రమైన మూట. దీనికి ‘ఇరుముడి’ అంటే ‘రెండు ముడులు’ అని అర్థం. ఇందులో రెండు భాగాలుంటాయి: ఒక భాగంలో భగవంతునికి సమర్పించే పదార్థాలు నెయ్యితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరుబత్తులు వంటివి,మరో భాగంలో ప్రయాణానికి అవసరమైన వస్తువులు బియ్యం, ఉప్పు, మిరపకాయలు వంటివి ఉంటాయి. యాత్రికులు తలపై ఈ మూటను పెట్టుకుని స్వామిని దర్శిస్తారు. ఇరుముడి గురించి ముఖ్యమైన విషయాలు ఇరుముడి అంటే ‘రెండు ముడులు’ లేదా ‘ముడుపులు’ అని అర్థం. అయ్యప్ప దీక్షలో భక్తి, శ్రద్ధ అనే రెండు ముడులను సూచిస్తుంది.మొదటి భాగం ఇందులో నెయ్యి నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరుబత్తులు, సాంబ్రాణి, తమలపాకులు, పోకవక్కలు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు వంటివి ఉంటాయి.ఇందులో బియ్యం, ఉప్పు,మిరపకాయలు, నూనె వంటి ప్రయాణ అవసరాలు ఉంటాయి.
ఇరుముడిని గురుస్వామి దీక్షాపరులకు అందిస్తారు.ఇది అయ్యప్ప దర్శనానికి వెళ్ళేందుకు తప్పనిసరి.
కొబ్బరికాయలో నెయ్యి పోయడం వల్ల అది అయ్యప్పకు అభిషేకంగా భావిస్తారు.యాత్ర ముగిసిన తర్వాత, స్వామి దర్శనం అయిన తర్వాతే ఇరుముడిని విరమిస్తారు.ఇరుముడిని అత్యవసర సమయాల్లో తప్ప కిందికి పెట్టకూడదని చెబుతారు.‎అయ్యప్ప స్వాముల ఇరుముడి అంటే ఏమిటి.. అందులో దేవుడి మాలల్లో అతి ముఖ్యమైన మాల అయ్యప్ప స్వామిది. అయ్యప్పమాల అత్యంత పవిత్రమైనది కఠినమైనది కూడా. ‎ ‎ఈ మాల ధరిస్తే నిష్టతో దైనందిన జీవితం మారుతుందన్నారు

Scroll to Top