ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ…
రుద్రూర్, నవంబర్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, సులేమాన్ నగర్, రుద్రూర్ గ్రామాలల్లో ఐకేపి మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఈ చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నారోజి గంగారం, ఓబీసీ జనరల్ సెక్రెటరీ పట్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దత్తాత్రి, కుర్మాజీ సాయిలు కృష్ణ, సులేమాన్ నగర్ మాజీ ఎంపిటిసి షేక్ గౌస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎస్ కే. అహమద్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఎస్ కే ఖాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐకేపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
