PS Telugu News
Epaper

వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అండ : మంత్రి ఎన్ఎండి ఫరూక్

📅 24 Nov 2025 ⏱️ 5:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

రైతన్నా – మీకోసం” పంచ సూత్రాలపై ఇంటింటికి తిరిగి రైతులకు అవగాహన కల్పించిన మంత్రి ఫరూక్ *
నంద్యాల మండలం, పోలూరు గ్రామంలో సోమవారం రోజున వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో “రైతన్నా – మీకోసం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇంటింటికి స్వయంగా తిరిగి ‘రైతన్నా-మీకోసం’ పాంప్లెట్‌లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అండగా అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకుంటూ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని . చంద్రన్న నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు. ‘రైతన్నా-మీకోసం’ కార్యక్రమాన్ని ఈ నెల నవంబర్ 24 నుండి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ పంచ సూత్రాల విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
రైతన్నా-మీకోసం పంచ సూత్రాలు:

  • నీటి భద్రత
  • డిమాండ్ ఆధారిత పంటలు
  • అగ్రిటెక్ (AgriTech)
  • ఫుడ్ ప్రాసెసింగ్
  • ప్రభుత్వాల మద్దతు
    ఈ పంచ సూత్రాల ద్వారా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చి, అన్నదాతలకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, పైరెడ్డి జోజీరెడ్డి, జయచంద్రరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, అర్ఫాత్ బాషా, మోదీన్, మదర్ సా, వడ్ల అర్షద్ బాషా,చంద్ బాషా,పెద్ద గుండాలు,భూపాల్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, ఇతర అనుబంధ శాఖల సిబ్బంది, స్థానిక నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Scroll to Top