PS Telugu News
Epaper

విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

📅 24 Nov 2025 ⏱️ 6:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

విద్యార్థినిలతో కలసి భోజనం చేసిన మంత్రి జూపల్లి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. లెఫ్ట్ పోచంపహాడ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంబించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ లను ఉపయోగించుకోని భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని సూచించారు.మొబైల్ యాప్ ద్వారా టీచర్స్ , పేరెంట్స్ విద్యర్ధుల స్టడీస్ పై నేరుగా అబ్జర్వ్ చేయగలరని తెలిపారు. విద్యార్థులు నేర్చుకోవడం కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేసుకోవాలన్నారు.ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే మనం లేమని అన్నారు. కరెంట్, టెలిఫోన్ లాంటివి అన్ని ఇన్నోవేషన్ నుండి వచ్చినవే అని తెలిపారు. ఇన్నోవేషన్‌కు ఆకాశమే హద్దు అని.. నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కంప్యూటర్ పోయి ఏఐ వచ్చిందని ప్రస్తావించారు.అనంతరం విద్యార్థినిలతో కలసి మంత్రి భోజనం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. వారి విద్యాభ్యాసం సామర్థ్యాలను పరీక్షించారు. పిల్లల జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.

Scroll to Top