రైతన్న సేవలో కూటమి ప్రభుత్వం
పయనించే సూర్యుడు నవంబర్ 24 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం
సుండుపల్లి మండలం మంచిరెడ్డిగారిపల్లి గ్రామపంచాయతీ నందు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు విడుదలైన సందర్భంగా ప్రతి పల్లి లో ప్రతి రైతును కలిసి తెలుగుదేశం పార్టీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్ని పథకాల అమలు చేశారని ప్రతి రైతుకు అండగా నిలబడిందని రైతులకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల క్లస్టర్ కన్వీనర్ ఎల్.వి.రమణ, సుండుపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దప్పేపల్లి చంద్రమౌళి, బూత్ కన్వీనర్ మూడే.జ చంద్రనాయక్, మాచిరెడ్డి గారి పల్లి గ్రామపంచాయతీ హార్టికల్చర్ అసిస్టెంట్ రాధా రాణి , ప్రకృతి వ్యవసాయసిబ్బంది రామాంజనేయులు, రాజు నాయక్ మరియు రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది