PS Telugu News
Epaper

మహిళా అభివృద్ధి ఆదర్శనం గా నిలిచిన పలు గ్రామాలు

📅 24 Nov 2025 ⏱️ 6:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

గేదెలను పరిశీలించిన టీం అధికారి విమల

పయనించే సూర్యుడు నవంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

స్ఫూర్తిగా నిలిచిన పొదుపుసంఘాలు మహిళాభివృద్ధి ఆదర్శం తీసుకున్న యూనిట్లను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని తద్వారా కుటుంబ ఆర్ధిక పరిస్థితులు మెరుగు పరుచుకొని అందరికి ఆదర్శంగా ఆ పొదుపు సంఘాలు నిలిచాయని సెర్ప్ అసెట్ వెరిఫికేషన్ వృత్తి క్యాటలిస్ట్ మానేజ్మెంట్ టీం అధికారి విమల పేర్కొన్నారు. సోమవారం ఆమె చేజర్ల మండలం లోని యనమదల , తూర్పుకంభంపాడు గ్రామాల్లోని గేదెల యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనోపాధి కల్పనాకేంద్రం నిధులతో 5 లక్షలు ఋణం పొంది గేదెలను తీసుకొని వాటిని సక్రమంగా వినియోగించుకొని వారి కుటుంబాలు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. 35 శాతం సబ్సిడీ తో వీటిని అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లా లోని పొదుపు సంఘాలు వీరిని ఆదర్శం గా తీసుకొని స్వయం గా ఎదగాలన్నారు. యూనిట్ల నిర్వహణ గురించి, సమస్య ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈమె వెంట డిపిఎంఎల్ హెచ్ మధుసూదన్, ఏపిఎం నాన్ ఫామ్, ఏపిఎం ఎఫ్ పి ఓ , ఏపిఎం ఐఎఫ్ సి, చేజర్ల ఏపిఎం సుజన, సి సిలు , విఓఏ లు పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top