PS Telugu News
Epaper

లహుజి సాల్వే జయంతి రాజ్యాంగ దినోత్సవం ఝరి బి గ్రామం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది

📅 26 Nov 2025 ⏱️ 4:58 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లహుజి సాల్వే సేన యూత్ ఆధ్వర్యంలో లహుజి సాల్వే జయంతి రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా గ్రామస్తులంతా అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తం భలేరావు మహాత్ముల చిత్రపటాలకు పూజ చేసి నివాళులు అర్పించారు. మాజీ ఎంపిటిసి గైక్వాడ్ లక్ష్మీబాయి అన్న భావు సాటే విగ్రహనికి.పూల మాలలు వేసి లహుజి సాల్వే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గైక్వాడ్ లాలూ మాట్లాడుతూ లహుజి సాల్వే స్వాతంత్ర సమరయోధుడు స్వతంత్ర పోరాటంలో ముఖ్య వ్యక్తిగా పాల్గొన్న వ్యక్తి లహుజి సాల్వే ఈ దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుందో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం ఇవ్వడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీజీ ఈ యొక్క ఇద్దరి గురువుల యొక్క గురువు లహుజి సాల్వే అని కొనియాడారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే మనం ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటున్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి మహానీయుడికి మనం ప్రతి చోటా గౌరవం ఇవ్వాలని కోరడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటం వల్లనే ఈరోజు మనం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ద్వారానే మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ రావడం అనేది జరిగింది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా మాజీ ఎంపీటీసీ. గైక్వాడ్ లక్ష్మీబాయి మాజీ సర్పంచ్ బాబన్న, మాజీ ఏ ఎం సి డైరెక్టర్ మేకల దేవదాస్, ఫీల్డ్ అసిస్టెంట్ జాదవ్ దన్సింగ్, డగే శంకర్, బేర్జె విఠల్, దొంతుల రమేష్ ఏ .ప్రకాష్, గైక్వాడ్ లాలూ, గైక్వాడ్ బాబు, లహుజి సేన యూత్ సభ్యులు తూరటికర్ పోతన్న , గైక్వాడ్ కేశవ్, గైక్వాడ్ చంద్రకాంత్, గైక్వాడ్ అవినాష్, గైక్వాడ్ మరోతీ , మహిళలు యువతిలు యువకులు గ్రామస్తులు అందరూ తది తరులు పాల్గొన్నారు

Scroll to Top