PS Telugu News
Epaper

రెండవ రోజు పరిశుభ్రతపై అవగాహన

📅 26 Nov 2025 ⏱️ 5:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

విద్యార్థులకు పలకలు పంపిణీ

పయనించే సూర్యుడు నవంబర్ 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం స్పెషల్ క్యాంప్ కార్యక్రమాన్ని చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ తూర్పు ఎస్సీ కాలనీలో రెండవ రోజు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం గొల్లపల్లి లో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కామర్స్ లెక్చరర్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్. లక్ష్మీ జ్ఞానేశ్వరి. మాట్లాడుతూ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం భాగంగా స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థి విద్యార్థులకు పలకలు ప్రిన్సిపల్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వ కళాశాల విద్యార్థి విద్యార్థులు గొల్లపల్లి గ్రామంలో పలు వీధుల్లో ముల్లకంప. చెట్లు తొలగించి పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని తెలిపారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడత హాజరత్తయ్య . అంగనవాడి కార్యకర్త పి పద్మ. కళాశాల అధ్యాపకులు . విద్యార్థి విద్యార్థులు. స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top