బాసర త్రిబుల్ ఐటీ లో వైభవంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు”
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ నియోజకవర్గం ఖాళీ వెలుగుల చక్రపాణి.
త్రిబుల్ ఐటీ బాసర లో ఎస్.సి., ఎస్.టి. సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ రేవల్లి అజయ్ అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి విశ్వవిద్యాలయ ఉప ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓ. ఎస్.డి. ప్రొఫెసర్ ఈ మురళీధర్షన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఉపకులపతి గోవర్ధన్ ఉద్యోగులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ మూల సూత్రాలు, ప్రవేశిక, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్న అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్రజలందరూ రాజ్యాంగ ఫలాలను అందుకోవాలని అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు పాటుపడాలని కోరారు.ప్రొఫెసర్ ఈ మురళీ దర్శన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పార్లమెంటరీ కమిటీలో బాబు రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టగా, ఆమోదం ముద్ర వేశారని వివరించారు. భారత రాజ్యాంగంలో ఉద్యోగులకు కార్యనిర్వహణలో కీలకమైన బాధ్యత ఉందని, దీన్ని గుర్తించి ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.డాక్టర్ రేవల్లి అజయ్ మాట్లాడుతూ రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవహరించారని అందుకే ఆయన రాజ్యాంగ పితామహునిగా పేరు పొందారని అన్నారు.అనంతరము అందరూ భారత రాజ్యాంగ పీఠికను పఠనం చేశారు.ఈ కార్యక్రమంలో సి.ఎస్.ఓ. డా.రాజేష్, అసోసియేట్ డీన్లు డా. విటల్, డా.మహేష్, ఎస్ .శేఖర్, డా.జి నాగరాజు, చీఫ్ వార్డెన్ టి. మధుసూదన్ రెడ్డి, అన్ని విభాగాధిపతులు, బోధన బోధ నేతల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
