ఆషాడ మాసం సందర్భంగా గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి విశేషాలంకరణ.
పయనించే సూర్యుడు జూలై 31 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)కాట్రేనికోనలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి ఆషాడ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పూలమాలలతో విశేషాలంకరణ చేశారు.ఆలయ ప్రధాన అర్చకుడు ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలిత విగ్నేశ్వరుని పూజ, అమ్మవారికి అభిషేకం మరియు శ్రీ సూక్త విధానం గా సహస్రనామ కుంకుమార్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.అనంతరం నీరాజనం మంత్రపుష్పాలు, వేద స్వస్తి జరిపారు. ఈ సందర్భంగా మహిళల చే సామూహికంగా లలితా సహస్ర పారాయణo చేశారు.అలాగే ఆలయ ఆవరణలో గల వినాయకుడు , షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఆకొండి వెంకట సూర్యనారాయణమూర్తి, ఆ కొండి రవి గారుఆధ్వర్యంలో పులిహోరప్రసాద వితరణ జరిగింది.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి జరిగిన పూజా విధానాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆణి విళ్ళ సాయిబాబా,ఆణి విళ్ళ రామకృష్ణ పరమహంస, , ఆణి విళ్ళ పవన్, వేదుల శ్రీను, ఆ కొండిశ్రీకాంత్, తాతపూడిపండు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం చేయడం జరుగుతోంది.ఆలయం చుట్టూ 11 ప్రదక్షణాలతో అమ్మవారికి ధూప సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈరోజు పల్లకి సేవను ప్రారంభించే భక్తులు , మంతెన వెంకటేశ్వర రాజు గారు, సుంకర కర పవిత్ర కుమార్ గారు., సుంకర బుజ్జి గారు, మరియు గ్రామస్తులు.