అశ్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలగ్రామసభ

July 31, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు, జూలై 31, అశ్వాపురం: శుక్రవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బాల గ్రామ సభను అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బాలసభను ఉద్దేశించి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పిల్లల అభిప్రాయాలను తెలుసుకోని , వారి సమస్యలను గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగం చేసి, గ్రామంలో ప్రతి పిల్లవాడు నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం, పరిశుభ్రమైన పరిసరాలు, సురక్షితమైన వాతావరణంలో ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది
అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి యాకుబ్ మరియు వార్డు సభ్యులు వేములపల్లి హసిత లు పిల్లల హక్కుల గురించి సందేశాని ఇవ్వడం జరిగింది.ఈ బాలసభలో పిల్లలు వారి యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది.దోమలు మందు కొట్టించాలని, స్కూల్ కి మిషన్ భగీరథ నీరు అందించాలని, డైనింగ్ హాల్ మరియు కిచెన్ షెడ్ కి సంబంధించి చిన్న చిన్న సమస్యలను తెలిజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో వీధి దీపాలు సక్రమంగా వెలిగే విధంగా చూడాలని తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలకు సర్పంచ్ స్పందిస్తూ మీ యొక్క సమస్యలను గ్రామ పంచాయతీ తరపున పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ యొక్క బాల గ్రామసభలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ వార్డు సభ్యులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper