గొల్లపల్లిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం మెడికల్ క్యాంపు
పయనించే సూర్యుడు నవంబర్ 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో నాలుగో రోజు గొల్లపల్లి గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని తూర్పు ఎస్సీ కాలనీలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వయోజనులకు, యువకులకు, వృద్ధులకు బీపీ, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి వివిధ రకాల వ్యాధులపై వారికి అవగాహన కల్పించి, నివారణోపాయాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ బి .యశోద, ఎం ఎల్ హెచ్ పి రత్నకుమారి, ఏఎన్ఎం దేవసేన, ఆశా వర్కర్లు పెంచలమ్మ, వెంకటరమణమ్మ, కావేరి మొదలగువారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈ మెడికల్ క్యాంపునుద్దేశించి గ్రామ తెలుగుదేశం నాయకులు ఉడత హాజరత్తయ్య మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్. ప్రసాద్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. వెంకటకృష్ణారెడ్డి. అంగన్వాడి కార్యకర్త పి. పద్మ . గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం