పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
—- రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అది చూసి ఓర్వలేక వేముల ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు చెప్తున్నాడు ఈరోజు శుక్రవారం రోజున రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైనప్పటి నుండి స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి తమకు గ్రామాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీరాల పంపిణీ, వడ్డీ లేని రుణాలు ఇస్తున్న సందర్భంలో ఇప్పటికే అయోమయంలో ఉన్న ప్రశాంత్ రెడ్డి అవి కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని, గతంలో మంత్రిగా చేసిన ప్రశాంత్ రెడ్డికి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడ మాణాల మోహన్ రెడ్డి అన్నారు. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేదని, మాఫీ చేయాలనే ఆలోచన కూడా వారికి రాలేదని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటే కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని,గత మూడు నెలల క్రితం కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని అప్పుడు ఎన్నికలు లేవని,మేము ఎప్పుడు ఇస్తున్నాము కాదు మీరు 9 సంవత్సరాల లో ఎందుకు రుణాలు మాఫీ చేయలేదు ఒక్కసారి ఆత్మ శుద్ధి చేసుకోవాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఇందిరమ్మ చీరలను ఆడపడుచులు గ్రామాల్లో కట్టుకొని మురిసిపోతున్నారని కానీ గతంలో టిఆర్ఎస్ సమయంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు నాణ్యత లోపంతో ఇవ్వడం ద్వారా రోడ్ల పైన కాలబెట్టిన సందర్భాలు ఉన్నాయని రైతులు తమ పోలాలకు పిట్టల కాపాలకు వాడిన సందర్భాలు ఉన్నాయని, ఏ రోజు కూడా టిఆర్ఎస్ సమయంలో ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు బతుకమ్మ రోజు కట్టుకోలేదని, అంత నాణ్యత లోపంతో టీఆర్ఎస్ చీరలు పంపిణీ చేయడం జరిగిందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాపాలనను ఓర్వలేకనే ప్రశాంత్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న ప్రజా పాలన ద్వారా జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలో సర్పంచులు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన ప్రశాంత్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడడం మానుకోకపోతే కచ్చితంగా స్థానిక సంస్థల్లో ప్రజలు ప్రశాంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరుగుతుంది . బాల్కొండ లో ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లో కేటీఆర్ అధికారం పోవడంతో మతిస్థిమితం కోల్పోయి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను అధిక మెజారిటీతో గెలిపించాలని మానాల మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భీంగల్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు జె జె నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,గోపాల్ నాయక్,అన్వేష్, మహేష్,దొంకంటి రాజేష్,నాగభూషణం, శ్యామ్ రాజ్,సాయి బాబా,నవీన్,పల్లికొండ అశోక్, టీ గంగాధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.