PS Telugu News
Epaper

కలికాలంలో ఎన్ని కధలు చూడాలో.ఎన్ని వింతపోకడలు వినాలో.ఈ వార్త చదివిన తరువాత ముక్కున వేలు వేసుకోవాల్సిందే..

📅 01 Dec 2025 ⏱️ 2:18 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

తెలిసి తెలియని వయసులో కొందరు చేస్తున్న పిచ్చి పనులు వారికే కాకుండా వారి కుటుంబానికి సైతం మాయని మచ్చని తీసుకొస్తున్నాయి. నిండా పద్దెనిమిది ఏళ్లు కూడా లేని జంట ప్రేమలో పడడం.. మేజర్లు కాకుండానే ఏకంగా తల్లిదండ్రులు కావడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది..బాలుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. బాలిక ఇంటర్ చదువుతుంది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.వనపర్తి మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు.. అదే ఊరులో ఇంటర్‌లో చదువుతున్న బాలిక మధ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పలుమార్లు శారీరకంగా దగ్గరవ్వగా.. బాలిక గర్భవతి అయింది. బాలికకు గర్భం వచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇద్దరూ మైనర్లు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలకు సమాయత్తమవుతున్నారు. కానీ ఇంతలోనే బాలిక నవంబర్ 14వ తేదీన శిశువుకు జన్మనివ్వడంతో విషయం గ్రామమంతా హాట్ టాపిక్ గా మారింది.క్రమంలోనే గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టగా.. బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకుకు ఎలాంటి సంబంధం లేదంటూ వాగ్వాదానికి దిగడంతో ఇరు కుటుంబాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తతకు తెరలేపింది. మరోవైపు కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో బాలిక కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు సమర్పించారు. శిశువు తండ్రిని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష చేయాలని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అయితే ఇద్దరూ మైనర్లు కావడంతో ఇది స్పెషల్ పోక్సో చట్ట పరిధిలోకి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటన పట్ల గ్రామస్తులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top