ప్రచారంలో దూసుకుపోతున్న అనుభవజ్ఞుడు, డైనమిక్ లీడర్ సదర్ లాల్
పయనించే సూర్యుడు,డిసెంబర్ 1, అశ్వాపురం ప్రతినిధి.
చిరునవ్వుతో పలకరింపు, మాట మీద నిలబడే మనిషి, అనుభవజ్ఞుడు, గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి నడుం బిగించిన సదర్ లాల్ ప్రచారంలో అందరికన్నా ముందు ఉన్నారు గతంలో తన శ్రీమతి శారద చేసిన అభివృద్ధి ని కొనసాగిస్తా అని పంచాయతీ కి అన్ని హంగులతో నూతన భవనం నిర్మాణం మిగిలిన కొద్దిపాటి రోడ్లు సైడ్ డ్రైనేజీ లు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రచారంలో ముందు ఉన్నారు, గ్రామంలో ఎన్నికల కోలాహలం ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది.మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన జరిగే సర్పంచి ఎన్నికల్లో అందరినీ కలుపుకుపోయే మనిషి, కార్మిక నేతగా సుధీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అనుభవజ్ఞుడు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలకు సేవ చేసేందుకు ఆయన స్పష్టమైన హామీలు ఈ విధంగా ఇస్తూ ఉన్నాడరు. అందుకు అన్ని విధాలుగా ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలకు చేదోడువాదోడుగా ఉండే విధంగా గ్రామపంచాయతీ సిబ్బంది ఉండేలా తీర్చిదిద్దటం.ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన చెపుతున్నారు , హామీలు ఇస్తూన్నారు ప్రజలకు సేవకుడిగా ఉంటూ హామీలు నెరవేర్చటమే తన ధ్యేయమని, తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారి ఆశీర్వాదాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.ప్రలోభాలకు లొంగొద్దని పనిచేసే నాయకుడిని స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మంచి తీర్పు ఇవ్వాలని తనకు అవకాశం ఇచ్చి అశ్వాపురం గ్రామప్రజలు మంచి తీర్పు ఇవ్వాలని సదర్ లాల్ కోరారు, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అడుగుజాడల్లో తాను పని చేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తానని అశ్వాపురం గ్రామం అభివృద్ధి జరిగే వరకు తాను కృషి చేస్తానని గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.