PS Telugu News
Epaper

సిఐటియు18వ అఖిల భారత మహాసభలు

📅 01 Dec 2025 ⏱️ 3:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిశంబర్ 1 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట సిఐటియు 18వ అఖిలభారత మహాసభలు విశాఖపట్నం లో డిసెంబరు 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సుళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సిఐటియు కార్యాలయంలో గోడ పత్రికలు మరియు స్టిక్కర్ల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుళ్ళూరుపేట సిఐటియు అధ్యక్షులు కామ్రేడ్ సి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిఐటియు 18వఅఖిలభారత మహాసభలో కార్మికుల ప్రయోజనాల కాంక్షిస్తూ అనేక తీర్మానాలు చేయబోతున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 29 కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల ను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేలుగా ప్రకటించాలని ,స్కీము కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో మరియు లారీ బస్సు వర్కర్లు లాంటి వాళ్లకు ప్రభుత్వం పేద వర్గానికి ఇచ్చే సబ్సిడీలు అమలు చేయాలని. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలనే ముఖ్యమైన తీర్మానాలు చేయబోతున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి కామ్రేడ్ కే లక్ష్మయ్య కోశాధికారి కామ్రేడ్ రామరాజు సిఐటియు నాయకులు రమణమ్మ హైమావతి అంగన్వాడి వర్కర్స్ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top