PS Telugu News
Epaper

“రాజకీయాల్లో అల్లకల్లోలం: 2 వేల కోట్ల మసాలా బాండ్‌పై ఈడీ నుంచి సీఎంకు నోటీసులు!”

📅 01 Dec 2025 ⏱️ 4:03 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. సీఎం విజయన్‌ వ్యక్తిగత కార్యదర్శితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.  వ్యక్తిగత హాజరు అవసరంలేని ఈ నోటీసును మసాలా బాండ్ జారీలో ఫెమా (FEMA) ఉల్లంఘించారనే  ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. కేరళ రాష్ట్రం 2019లో మసాలా బాండ్లను జారీ చేసింది. ఆ తరహా బాండ్లను జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళనే. అయితే భారత సంస్థలు విదేశాల్లో స్థానిక కరెన్సీలో కాకుండా.. భారత కరెన్సీలో వీటిని జారీ చేశాయి. వీటి ఉద్దేశం దేశీయంగా వృద్ధికి దోహదపడేలా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించడం, రూపాయి అంతర్జాతీయీకరణ చేయడమే. ఇక, ఈ బాండ్ల ద్వారా కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (KIIFB) రూ.2,000 కోట్ల వరకు సమీకరించింది.  ఆ తర్వాత వీటిని లండన్ ఎక్స్చేంజీకి ఇవ్వడం ద్వారా దాని విలువ రూ.2,150 కోట్లకు పెరిగింది.అయితే  రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలో భాగంగా పినరయి విజయన్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లను సేకరించే ఈ బాండ్లను తీసుకువచ్చింది. ఇలా సేకరించిన ఈ నిధులను కేరళ ప్రభుత్వం అక్రమంగా మళ్లించారని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా.. జనవరిలో మాజీ మంత్రి థామస్‌కు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం రూ.468 కోట్ల లావాదేవీలకు సంబంధించిన షోకజ్ నోటీసులు ఇచ్చామని  అధికారులు వెల్లడించారు. ఈ నోటీసులకు సీఎం వ్యక్తిగతంగా దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.


Scroll to Top