PS Telugu News
Epaper

సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి

📅 02 Dec 2025 ⏱️ 2:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 2 సూళ్లూరుపేట ( మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట నియోజకవర్గం గతంలో నెల్లూరు జిల్లాగా ఉండేది గత ప్రభుత్వం సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద,సామాన్య ప్రజలు జిల్లా అధికారుల్ని సమస్యల గురించి కలవాలంటే ఇబ్బందికరంగా మారింది పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలు సమస్యల గురించి జిల్లా కలెక్టర్ కార్యాలయం గాని జిల్లా ఇతర అధికారుల్ని కావాలంటే ఉదయాన్నే ఆర్టిసి బస్సు ఎక్కి తిరుపతిలో దిగి అక్కడ అధికారులు కలిసి తిరిగి సూళ్లూరుపేట నియోజవర్గానికి చేరుకోవాలంటే అర్ధరాత్రి అవుతుంది కనుక చాలా కష్టంతో కూడిన పని, తిరుపతి జిల్లాకి సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి రైలు మార్గం లేదు ప్రజలకు రవాణా ఇబ్బందికరంగా మారుతుంది గతంలో నెల్లూరు జిల్లా కు సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి నెల్లూరుకు పోవాలంటే ప్రజలకు అనుకూలంగా రైలు మార్గం అన్ని రవాణా సౌకర్యాలు సామాన్యులకు అనుకూలంగా ఉండేది కనుక సూళ్లూరుపేట నియోజవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని సూళ్లూరుపేట నియోజకవర్గ సామాన్య ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు

Scroll to Top