PS Telugu News
Epaper

పేద ప్రజల అండ దండ ఎర్రజెండా,

📅 02 Dec 2025 ⏱️ 2:06 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 2 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్ దాసు)

సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి దేశంలో ఆకలి దారిద్రం లేని సమసమాజ స్థాపన కోసం సిపిఐ నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే జెండా ఎర్రజెండా ఒక్కటేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి అన్నారు.సోమవారం ఉదయం 11 గంటలకు రేణిగుంట అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక ప్రైవేటు బిల్డింగ్ లో రేణిగుంట మండలం సిపిఐ పార్టీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణా తరగతులు ప్రారంభించారు.అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ దేశంలో అసమాన తల సమాజాన్ని రూపుమాపి సమ సమాజ నిర్మాణం కోసం పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న జెండా ఎర్ర జెండా నే అని అని స్పష్టం చేశారు. భూమి కావాలని ప్రతి పేదవాడికి ఇంటి స్థలం దక్కాలని పోరాడుతున్నామని 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికీ కూడా పేదవాడికి ఇంటి స్థలం లేకపోవడం బాధాకరమన్నారు.స్వతంత్ర పోరాటంలో పాల్గొనని వారు ఎర్రజెండా చరిత్రను తెలుసుకోలేని వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారని వారందరికీ ఒకటే గుణపాఠం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా వైపు పేద ప్రజలు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు అవినీతి అరికడతానని నిరుద్యోగ నిర్మూలస్తానని ఎన్నో వాగ్దానాలు చేసి నేడు ఆ దిశగా పయనించకుండా కేవలం కార్పొరేటర్లకు అనుకూలంగా వారి ఆస్తులను కాపాడడానికి మాత్రమే దేశ ప్రధానిగా ఉంటున్నాడని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి సూపర్ సిక్స్ పథకాలను కొంత మాత్రమే అమలు చేస్తున్నారని మిగిలిన వారికి అమలు చేయకుండా వాటికి తూర్పు పొడుస్తున్న కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ప్రజల చేతిలో తప్పక ఓడిపోవడం ఖాయం అని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు సిపిఐ శతవసంతాలు జరుపుకుంటున్న సందర్భంలో వేలాదిమంది కార్మిక కర్షక విద్యార్థి మహిళా మేధావులందరూ ఎర్ర జెండా అధికారంలోకి రావాలని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని రానున్న రోజుల్లో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకోసమే గ్రామలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులుకు రాజకీయ శిక్షణ తరగతులు నవంబర్ 15వ తారీకు నుండి డిసెంబర్ 26 వరకు చైతన్య పరుస్తూ శిక్షణ కల్పిస్తూ ఉన్నామని తెలిపారు.ప్రొఫెసర్ కె వెంకటరమణ మాట్లాడుతూ.. .కార్మికులకు కర్షకులకు కష్టాలు పోవాలంటే కమ్యూనిస్టు పార్టీ అవసరమని గుర్తించి 1925లో అనేక నిర్బంధాలు ఎదుర్కొని నిలబడి నేటికీ పేదల పక్షాన పోరాడుతున్న పార్టీ సిపిఐ అని తెలిపారు. దేశంలో మతోన్మాద శక్తులు వలన ప్రజల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని సూచించారు. కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక సిద్ధంగా చేస్తే లెనిన్ దాన్ని ఆధారంగా రష్యాలో అమలు చేసి 19 17 లో విప్లవం తీసుకొచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజవర్గ కార్యదర్శి జనామాల గురవయ్య. సిపిఐ మండల కార్యదర్శి వైయస్ మనీ ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు కార్తీక్ మురళి రజాక్ చంద్ర జయరాం సెల్వం గురవయ్య చంద్రకళ రమణ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top