PS Telugu News
Epaper

ప్రచారం లో దూసుకుపోతున్న సదర్ లాల్…

📅 02 Dec 2025 ⏱️ 2:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఉదయాన్నే మార్నింగ్ వాక్ ప్రచారం..

తనదైన స్టైల్లో వేడుకోలు….

పయనించే సూర్యుడు, డిసెంబర్ 2 అశ్వాపురం :

మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధి బానోతు సదర్ లాల్ ప్రచారం లో తన దైన స్టయిల్లో దూసుకుపోతున్నారు,గ్రామపంచాయితీ ప్రజల బాధలు,అవసరాలు, తెలిసిన నేత, కార్మిక రాజకీయాలలో తలపండిన అనుభవజ్ఞుడు గుడ్ మార్నింగ్ అశ్వాపురం అని తెల్లవారుజామునే గ్రామంలో ప్రతీ వార్డు తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతూ పాదయాత్ర చేస్తున్నారు, తన శ్రీమతి మరియు గత సర్పంచ్ శారద స్పూర్తి తో గ్రామం లో మిగిలిన సమస్యలను పరిష్కరించటమే తన ధ్యేయం అని పొద్దు పొద్దున్నే పంచాయతీలో గల పలు కాలనీల్లో కలయతిరిగి ఓటర్లను కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని , మీ సమస్యలకు పరిష్కారం నా గెలుపు అని అభ్యర్ధిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారి ఆదేశాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.ప్రలోభాలకు లొంగొద్దని పనిచేసే నాయకుడిని స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత,వార్డు అభ్యర్థులు వేములపల్లి హషిత,కొమరం కౌసల్య,గుర్రం త్రివేణి, నూకల లింగయ్య,సవలం అనిల్,నాయకులు వేములపల్లి రమేష్, షేక్ ఖధీర్,బూతం వెంకటేశ్వర్లు,తాడబోయిన వెంకటేశ్వర్లు,వలబోజు మురళీకృష్ణ, టీ డీ పి వాసు,ఇలాసాగరపు వరప్రసాద్, చుంచు ప్రదీప్ పాల్గొన్నారు

Scroll to Top