గుండాలు వంక పొంగి వంతెన తెగిపోవడంతో తెగిపోయిన వంతెనను పరిశీలించిన మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు
పయనించే సూర్యుడు డిసెంబర్2 అన్నమయ్య టీ సుండుపల్లె మండలం
సుండుపల్లి మండలం పెద్దినేని కలవ బట్ట రాజు గారి పల్లి నుండి సుండుపల్లికి రావడానికి గుండాల వంక తెగిపోయి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని బట్ట రాజు గారి పల్లి నుండి సుండుపల్లి రావడానికి చాలా దగ్గరైన రోడ్డు మార్గమని గుండాల వంక తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని బట్ట రాజుగారి ప్రజలు సుండుపల్లి మండల టిడిపి అధ్యక్షుడు రమేష్ నాయుడు కి తెలియజేయగా వెంటనే సంబంధిత అధికారులతో, టిడిపి నాయకులతో గుండాల వంకను పరిశీలించి వెంటనే వంక వంతెన నిర్మాణం చేపడతానని బట్ట రాజు గారి పల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యూసుఫ్, కో కన్వీనర్ మహేష్ వర్మ, టిడిపి నాయకులు వెంకటేష్ నాయుడు, భాష, నాగ సుబ్బయ్య, చంద్రశేఖర్ రాజు, పాపరాజు,వెంకట్రామరాజు, సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు