PS Telugu News
Epaper

దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని

📅 04 Dec 2025 ⏱️ 6:20 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

టి యు సి ఐ నాయకులు జి.అరవింద్ డిమాండ్ చేశారు,,తేదీ:4/12/2025న మాక్లూర్ మండంలోని చిన్నాపూర్ గ్రామాంలో బీడీ కార్మికులతో కలిసి దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీయజమాన్యానికి వ్యతిరేకంగా బీడీ కార్మికలతో పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి. అరవింద్ మాట్లాడుతూ,,దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమాన్యం,, చట్టాన్ని ఉల్లంఘిస్తూ బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు అగ్రిమెంట్ ప్రకారంగా 261,97 పైసలు ఇవ్వాల్సింది పోయి 1000బీడీలకు ₹10 తక్కువ చెల్లిస్తూ కార్మికుల శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని ,,గత కొన్ని నెలల నుండి దేశాయి బీడీ కంపెనీ యజమాన్యానికి తెలియజేసిన మొండిగా వ్యవరించడం సరైనది కాదని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, 1000 బీడీలకు 10 రూపాయలు తక్కువ చెల్లిస్తున్న దాన్ని వెంటనే ఆపాలని అట్లాగే,,ప్రభుత్వానికి టెక్స్ ఎగ్గొట్టే విధంగా బీడీ కార్మికులకు బలవంతంగా తినుబండారాలు చిప్స్ ప్యాకెట్స్ ఇవ్వడం వెంటనే ఆపాలని ఈ సందర్భంగా దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ యజమాన్యానికి తెలియజేస్తున్నాం, అట్లాగే వెయ్యి బీడీలకు సరిపడే ఆకు తంబాకు దారం వెంటనే ఇవ్వాలని,, లేనియెడల వివిధ బీడీ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని,, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం,,ఈ కార్యక్రమంలో, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏరియా నాయకులు ఎండి. నజీర్ చిన్నాపూర్ గ్రామంలో బీడీ కార్మికులు, పాల్గొన్నారు,,

Scroll to Top