PS Telugu News
Epaper

అభివృద్దె తమ ఎజెండ అంటున్న వాంకర్ మంజూల – రామ్ రాజ్ దంపతులు..

📅 04 Dec 2025 ⏱️ 6:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, డిసెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):

సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ గ్రామం రాజకీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ సర్పంచ్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా వాంకర్ మంజూల – రామ్ రాజ్ దంపతులు బరిలో నిలిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్దె తమ ఎజెండ అని, ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని, మార్పు రావడం కోసమే సర్పంచ్ బరిలో దిగానని పేర్కొన్నారు. అవినీతి చేయం.. అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, సామాజిక ఐక్యత, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. సర్పంచ్ ఎన్నికల బరిలో దిగితే పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయమని గ్రామ రాజకీయ పరిశీలకులు అంటున్నారు

Scroll to Top