PS Telugu News
Epaper

ప్రశాంతగా ఉన్న గ్రామాల్లో ప్యాక్షన్ మంట రగల్చొద్దు”

📅 04 Dec 2025 ⏱️ 6:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 04, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న

ఎంపీటీసీ హరనాథరెడ్డి పై జరిగిన హత్యాఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వైసీపీ నాయకులు తెలిపారు.బాధితులకు అండగా వైసీపీ ఉంటుంది..వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష భరోసా ఇచ్చారు.నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామం ప్యాక్షన్ గ్రామం, గత 5 సంవత్సరాల నుండి ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ నాయకులు వైఎస్సార్ పార్టీకి చెందిన ఎంపీటీసీ హరినాథరెడ్డిపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమైన చర్యలని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్.ఐటీ.సీలో మెరుగైన చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథరెడ్డిని, కుటుంబ సభ్యులను కలిసి గురువారం నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Scroll to Top