సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం లో ఖాళీ కుర్చీలు ఒక ఉద్యోగి కూడా ఆఫీసులో లేరు
పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్న వంటి ఉద్యోగులు ఎవరు కూడా సామాన్య ప్రజలకు అందుబాటు లేరు ఒక పక్కన దిత్వా తుఫాను ప్రభావం వల్ల ప్రజల అవస్థలు పడుతుంటే సమయ పాలన పాటించని అధికారి యంత్రాంగం, ఈరోజు 2.45 నిమిషాలక సమయంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ మరికొందరి ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యానికి వెళ్తే. ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగి కమిషనర్ మాకు లంచ్ టైం 2:30 నుండి 3:30 వరకు ఇచ్చారు అందరూ ఇండ్లకు వెళ్లి భోంచేసి వస్తారని చెప్పాడు, ప్రభుత్వ నిబంధన ప్రకారం మున్సిపల్ ఆఫీసుల్లో మధ్యాహ్నం 1:00 నుండి 1:30 వరకు మాత్రమే లంచ్ టైం ఉంది ఒకవేళ లేట్ అయితే 2:00 గంటలకే రావాలి కానీ ఎవరు అందుబాటులో లేరు ఒకవేళ టౌన్ లో ఏదైనా పనిలో ఉన్నారు అనుకుంటే ఎవరు కూడా లేరు చాలాచోట్ల ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, వీధిలైట్లు వెళ్లడం లేదు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన ఫోన్ ద్వారా తెలియజేసిన ఎవరు పట్టించుకున్న దాఖలు లేదు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ కారు పాలన వ్యవస్థ మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు
