PS Telugu News
Epaper

మున్సిపల్ లో ట్రైనింగ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తున్న ఎన్ ఎస్ యు ఐ

📅 05 Dec 2025 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

నిజామాబాద్ బాల్కొండ నియోజవర్గం భీంగల్ మున్సిపల్ పరిధిలో

భీంగల్ మున్సిపల్ కమిషనర్ కి నిజామాబాద్ జిల్లా ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు సయ్యద్ రహమాన్ కలిసి భీంగల్ పట్టణంలోనీ కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినీలు నీళ్లు లేక చాలా బాధలు పడుతున్నారు. కనీసం స్నానం చేయడానికి కానీ, వాష్రూమ్లో గాని, ప్లేట్ల శుభ్రం కోసం గాని పాఠశాల ఆవరణలో నీటి సదుపాయం లేక నానా ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్క అధికారి వీరి బాధను పట్టించుకోక పోవటం మరియు విద్యార్థులు రోడ్ ఎక్కిన కూడా వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున విద్యార్థులకు ఉన్న నీటి ఎద్దడిని అరికట్టి వెంటనే వారి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సంపత్, అభి, సురేష్,రామ్, లక్ష్మణ్,అరుణ్ , గంగాధర్ .రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top