చీకటిలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం
పయనించే సూర్యుడు డిసెంబర్ 6( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరి జీవితాల్లో వెలుగును పంచాడు కానీ సూళ్లూరుపేట RTC బస్టాండు ఆవరణంలో ఉన్న ఆ మహనీయుడు విగ్రహం అంధకారంలో ఉన్నాడు అందరూ నాయకులు వచ్చి అంబేద్కర్ జయంతి ,వర్ధంతి జరుపుకొని వెళ్తారు కానీ ఆ మహనీయుడి విగ్రహం దగ్గర లైట్లు ఏర్పచలేదు పేరుకే ఎస్సీ నియోజకవర్గం కానీ ఎస్సీ లంతా కలిసికట్టుగా లేరు. అంబేద్కర్ విగ్రహం దగ్గర స్పాట్లైట్లు గతంలో ఉండేవి ఇప్పుడు అవి పాడైపోయి అసలు లైట్ కనెక్షన్ కూడా లేదు అంబేద్కర్ అందరూ మావాడు అంటూ చెబుతారు కానీ ,అందరి జీవితాల్లో వెలుగు నింపిన ఆ మహనీయుడు విగ్రహం అంధకారంలో దాదాపు గత సంవత్సరం రోజులుగా ఉన్నాడు ఇప్పటికైనా ఓ దళిత మేధావులు ఓ దళిత నాయకులు ఓ దళిత ప్రజా ప్రతినిధులు ఓ దళిత అధికారులు మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడమే కాకుండా ఆ మహానీయుడికి విద్యుత్ దీపాలు వెలిగేటట్టు చూడాలని పత్రిక ముఖంగా కోరడమైనది
