నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ని ఎవరైనా అవమానిస్తే చూస్తూ ఊరుకోం
పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట RTC బస్టాండ్ దగ్గర శనివారం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా సూళ్లూరుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత తిరుమూరు సుధాకర్ రెడ్డి చెప్పులు వేసుకుని అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది ఈ చర్య కావాలని చేసిన… అనుకోకుండా జరిగినా ఇది తీవ్రమైన చర్య .కోట్ల మంది ఆరాధ్య దైవం అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైన్ సెక్రటరీ ఆవుల దాస్ హెచ్చరించారు అయితే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న దళితుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాయి. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు సాక్షాత్తు దళిత సామాజిక వర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా ఈ చర్య పై ఆ నాయకుడిని ఖండించలేదు , ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఓ దళిత నాయకుడు అతని ప్రశ్నించగా
అతని తోవాగ్వాదాన్ని దిగాడు ఈ ఘటన హేయమైన చర్యని ఆయన అన్నారు. చెప్పులు వేసుకుని నివాళులర్పించిన ఆ నేతపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని. మాలమహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవుల దాస్, నిమ్మల సుదీర్, గోకుల్,చంగయ్య. ASS అధ్యక్షులు పిట్ల చిన్న, ఐడీజేయన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డి. కిరణ్, దళిత నాయకులు, డిమాండ్ చేస్తున్నారు..