డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త. రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, భారతరత్న డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ మహా పరినిర్వాణ దివస్.ఈ సందర్భంగా, చేజర్ల మండల తహశీల్దారు . మస్తానయ్య. మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ తుమ్మటి విజయభాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అనన్యమైనది. చదువు ద్వారా, పోరాటం ద్వారా సమాజంలో సమూల మార్పును తీసుకురావాలని కలలు కన్న మహనీయుడు ఆయన అని కొనియాడి, ఈ పవిత్రమైన రోజున, మనం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ చదువు సమీకరించు పోరాడు’ అనే ఆయన సందేశాన్ని జీవితంలో ఆచరిద్దాం అని తెలుపుతూ బాబాసాహెబ్ కి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు. వీఆర్వోలు. పంచాయితీ కార్యదర్శులు. రెవిన్యూ సిబ్బంది . మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
