PS Telugu News
Epaper

అశ్వాపురం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ కి ప్రజామద్దతు వెల్లువ – రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు

📅 07 Dec 2025 ⏱️ 12:18 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7:

జరగబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అశ్వాపురం గ్రామంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ప్రచారం ఉధృతంగా సాగుతున్నది, అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థి అయితే అభివృద్ధి కి ఆటంకం ఉండదు అని నిధులు వెల్లువలా తేగలిగే చాతుర్యం ఉన్న అనుభవజ్ఞుడు, కార్మిక ఉద్యమాలు చేసిన అనుభవజ్ఞుడు ఐతే గ్రామం అభివృద్ధి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కి గ్రామ ప్రజల నుండి అనూహ్య మద్దతు వస్తున్నది.తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారి ఆదేశాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.ప్రలోభాలకు లొంగొద్దని పనిచేసే నాయకుడిని స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత,వార్డు అభ్యర్థులు వేములపల్లి అశ్రిత,కొమరం కౌసల్య,గుర్రం త్రివేణి, చిట్టూరి భాస్కర్, నూకల లింగయ్య,సవలం అనిల్,నూకల కనతాల ధనలక్ష్మి నాయకులు, వేములపల్లి రమేష్, షేక్ ఖధీర్, షేక్ గాలిబ్, బూతం వెంకటేశ్వర్లు,తాడబోయిన వెంకటేశ్వర్లు,వలబోజు మురళీకృష్ణ, టీ డీ పి వాసు,ఇలాసాగరపు వరప్రసాద్, హరీష్, చుంచు ప్రదీప్, కాడారి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top