మోకాళ్లపై కూర్చొని పవన్ను సత్కరించిన సందర్భం… అభిమానం ఎక్కడికి చేరిందో చూడండి!
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటకలోని ఉడుపి శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కి ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదుని పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ప్రదానం చేసి సత్కరించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ చేస్తూ కర్ణాటకలో కూడా పవన్ హవా నడుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మోకాళ్లపై కూర్చొని మరీ పవన్ సన్మానం స్వీకరించడంతో పవన్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడని, ఆయన సింప్లిసిటీ అని, దైవంకు ఇచ్చే గౌరవం అని అంటున్నారు నెటిజన్లు.