కుంటాల కుబీర్ మండల ప్రత్యేక సమావేశాల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.శనివారం కుభీర్ కుంటాల మండలాల్లో మండల ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా సర్పంచులు తనకు ఏ అవసరమున్న తెలియజేయవలసిందిగా సూచించారు. సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పేరు సంపాదించాల్సిందిగా చెప్పారు. సమావేశంలో అధికారులు శాఖల వారిగా తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. సర్పంచ్ లు చెప్పిన సమస్యలను 45 రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో మహిళా సమైక్య భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి భవనాలు, సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా చెప్పారు. నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు.అదేవిధంగా పోడు భూముల్లో పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టవద్దన్నారు. సమావేశంలో శాఖల వారిగా జరుగుతున్న ప్రగతిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.