డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలకు సిద్దమైన సుండుపల్లి మండలం ఉపాధ్యాయుల టీమ్
పయనించే సూర్యుడు డిసెంబర్8 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సుండుపల్లి ఉపాధ్యాయుల మండల స్థాయి క్రికెట్ పోటీలను మండల విద్యాశాఖధికారి వెంకటేష్ నాయక్ గారు మరియు రాయవరం హైస్కూల్ హెచ్ఎం అమృనాయక్ మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరిఫుల్లా గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పోటీలను రెండు టీములుగా
విభజించి ఒకటి స్కూల్ అసిస్టెంట్స్ టీమ్ గాను, రెండో టీం ఎస్ జి టి టీచర్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది అందులో హోరాహోరిగా పోడిన ఉపాధ్యాయులు చాలా ఉత్సాహం ప్రదర్శించారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ టీం 12 ఓవర్ల లో 87 పరుగులు చేయగా ఎస్ జి టి టీం 66 పరుగులు చేసింది. స్కూల్ అసిస్టెంట్ టీమ్ ఘనవిజయము సాధించడం జరిగింది. మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ పోటీలలో పాల్గొనడం జరిగినది.ఆహ్లాదకరమైన వాతావరణం లో జరిగిన పోటీలను తిలకించిన రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ ప్రధానోపాధ్యాయులు శ్రీ నాగరాజ్ నాయక్ గారు గెలుపొందిన టీమ్ ను ఉత్సాహ ప్రోత్సహిస్తూ 2116/- లు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా డివిజన్ స్థాయి లో మన మండలం విజయం సాధిస్తే 5116/- రూపాయలు ఉపాధ్యాయులకు అందజేస్తారని అలాగే జిల్లా స్థాయిలో మన మండలం టీము విజయం సాధిస్తే 10116/- ఇస్తారని ప్రకటించడం జరిగింది.
పోటిల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు డ్రస్ కోడ్ టీ-షర్ట్స్ లను మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అరిఫుల్లా అందజేయడం తో పాటు ఉపాధ్యాయులు అందరికి మధ్యాహ్నము భోజనం ఏర్పాటు చేసారు.