PS Telugu News
Epaper

అశ్వాపురం గ్రామంలో జోరుగా కొనసాగుతున్న సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ప్రచారం

📅 09 Dec 2025 ⏱️ 2:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

విజయం వైపు బానోతు సదర్ లాల్ పయనం ఊపందుకున్న రాజకీయ వేడి

పయనించే సూర్యుడు అశ్వాపురం,డిసెంబర్ 9 :

మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం గ్రామంలో ఫుట్ బాల్ గుర్తు బనోత్ సదర్ లాల్ జోరుగా ప్రచారం కొనసాగించారు అశ్వాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఫుట్ బాల్ గుర్తుకే ఓటు వేయాలి అంటూ నినాదాలు ఇస్తూ సర్పంచ్ అభ్యర్థిని కచ్చితంగా గెలుచుకోవాలని, స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకోగల అనుభవజ్ఞుడు, అధికార పార్టీ నుండి గ్రామాభి వృద్దికి నిధులు తేగలిగిన సమర్థుడు, విద్యావంతుడు కార్మిక రాజకీయాలలో తలపండిన నేత, కనిపించిన ప్రతి ఒక్కరినీ అక్క,చెల్లీ , అన్న, తమ్ముడు,బాబాయ్ అని ఆత్మీయంగా పలకరించే వ్యక్తిత్వం గల సదర్ లాల్ ని గెలిపించాలని ప్రచారం కొనసాగించారు. అధికార పార్టీ అభ్యర్థి అయినందున నిధులు వెల్లువగా తేగలనని, తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారి ఆదేశాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రలోభాలకు లొంగొద్దని పనిచేసే నాయకుడిని స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత,వార్డు అభ్యర్థులు వేములపల్లి హషిత,కొమరం కౌసల్యగుర్రం త్రివేణి, నూకల లింగయ్య, సవలం అనిల్, నాయకులు వేములపల్లి రమేష్, షేక్ ఖధీర్,బూతం వెంకటేశ్వర్లు, తాడబోయిన వెంకటేశ్వర్లు, వలబోజు మురళీకృష్ణ, టీ డీ పి వాసు,ఇలాసాగరపు వరప్రసాద్, చుంచు ప్రదీప్ పాల్గొన్నారు.

Scroll to Top