రాయచోటి-సుండుపల్లి రహదారి పనులను త్వరగా పూర్తి చేయండి
ఆర్ అండ్ బి శాఖ అధికారులకు లేఖ రాసిన రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పయనించే సూర్యుడు డిసెంబర్9 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం
అసంపూర్తిగా ఉన్న రాయచోటి-సుండుపల్లి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ఓ లేఖ రాశారు.రాయచోటి-సుండుపల్లి మధ్య ప్రయాణించే ప్రజలు రోడ్డు అసంపూర్తి కారణంగా తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని వారి సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈ మార్గం పై ఆధారపడిన విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, రోగులకు రోజువారీ ప్రయాణం కష్టంగా మారిందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని. నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి, రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సూచించారు…
