ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్సై జిలాని ప్రత్యేక చర్యలు
పయనించే సూర్యుడు డిసెంబర్ 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు ఎస్సై జిలాని సిబ్బంది ఉదయం నుండి పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి సత్రం సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలను తొలగిస్తూ ట్రాఫిక్ అడ్డం లేకుండా పెట్టుకోవాలని ఆ ప్రాంత వాహనదారులకు షాపుల నిర్వాహకులకు సూచించారు.సూచించిన తర్వాత కూడా వాహనాలను ట్రాఫిక్ కు అడ్డంగా ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై జిలాని తెలిపారు.