భీంగల్ పట్టణంలో డిసెంబర్ 9 విజయ దివాస్ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ
👉 ఉద్యమసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు.గుక్కెడు తాగు, సాగు నీళ్లు లేక గోస పడుతున్న తెలంగాణ. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మా ఇవ్వాలని కోట్లాడిన సందర్భం.2004 కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పితే కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్ట దీక్ష చేస్తే దిగొచ్చిన యూపీఏ సర్కార్ 2014 లో తప్పనిసరి పరిస్థితిలో ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు. 2004 లోనే ఇవ్వాలి.కానీ పదేళ్ల ఆలస్యం తరువాత తెలంగాణ ప్రకటన చేశారు. ఈ ఆలస్యం అనేక మంది బిడ్డల అతబలిదానం చేశారు.కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ముమ్మాటికీ అమరుల త్యాగం, కేసీఆర్ పోరాటం తెలంగాణ రాష్ట్రం.ఈన కాచి నక్కల పాలు చేసినట్లు కేసీఆర్ కడుపులో పెట్టుకుని సాదుకున్న తెలంగాణ నేడు దోపిడి దొంగల పాలైంది.కేసీఆర్ పాలనలో జీఎస్డీపీలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 12వ స్థానానికి దిగజారిపోయింది.జీఎస్టీ వసూళ్లలో 1వ స్థానం నుంచి 28 వ స్థానం, తలసరి ఆదాయంలో 1 వ స్థానం నుంచి 4వ స్థానంకు పడిపోయింది. రేవంత్ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. రైతులను ఆదుకునే దిక్కులేదు కానీ రైజింగ్ తెలంగాణ అని పోకడకు పోతున్నాడు.
👉 మక్కలు కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్న రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది.రెండు నెలలు గా రైతుల కు మక్కల డబ్బులు ఇవ్వట్లేదు ..
👉 యూరియా సరిగా రావట్లేదు
👉రైతులకు కరెంటు సరిగా ఇవ్వట్లేదు.కరెంటు కోతలు పెరిగినాయి.
👉 వరికి రూ.500 ల బోనస్ ఇవ్వలేదు.
👉 సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది.
👉 ఆడబిడ్డలకు రూ. 2500 లు లేవు. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లేదు.ఆసరా పెన్షన్ 4000 లేదు.
👉 రూ. వేల కోట్ల విలువైన భూములు అమ్మే పని రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు.
👉 రాష్ట్రంలో రాక్షసుల , రాబందుల పాలన కొనసాగుతోంది. కెసిఆర్ బ్రహ్మాండంగా మార్చిన తెలంగాణను మళ్ళీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి.
