PS Telugu News
Epaper

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చలి తీవ్రత దృష్ట్యా జనసైనికులు దుప్పట్లు పంచిపెట్టారు

📅 10 Dec 2025 ⏱️ 6:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (సూ ళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట మండలంలోని తంగేడు దిబ్బ గిరిజన కాలనీ మరియు కారిజాత గిరిజన కాలనీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసైనికులు పేద ప్రజలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ సూళ్లూరుపేట ఆధ్వర్యంలో పద్మజ గారి సహకారంతో సుమారు 150 మందికి దుప్పట్లు బిస్కెట్లు పంచడం జరిగినది.ఈ కార్యక్రమకి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట బాల ఆంజనేయస్వామి ఆలయ పాలకమండలి అధ్యక్షులు వాకిచర్ల రమేష్ భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సెక్రెటరీ బెజవాడ విజయమ్మ వారి చేతులు ముందగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట జనసేన పార్టీ నాయకులు షేక్ మాభాష,ఆవుల రమణ,నక్క హరిబాబు, కయ్యాల కోటి, ఆవుల దాస్, శంఖు సురేష్, సూరి,హరి,ప్రవీణ్ వీర మహిళలు సుజాత, పాల్గొన్నారు.

Scroll to Top