PS Telugu News
Epaper

తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును తోడేలు లాక్కెళ్లిన ఘటనతో కలకలం!

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :తల్లిని అంటిపెట్టుకుని చలికి వెచ్చగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడికి ఆ రాత్రి కాళరాత్రయింది. శనివారం అర్ధరాత్రి చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు చిన్నారిని నోట కరుచుకుని అడవిలోకి పరుగుతీసింది. అలికిడికి లేచిన తల్లి గగ్గోలుపెట్టడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. అటవీ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్‌ కెమెరాలతో చిన్నారి జాడను వెతికాయి. శిక్షణ పొందిన షూటర్లు సైతం రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా అటవీ ప్రాంత గ్రామాలలో గతేడాది సీన్‌ రిపీటైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు గ్రామస్లుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కిరణ్‌ సంతోష్‌ దంపతుల నాలుగు నెలల సుభాష్‌ జాడ తెలియలేదు. ఈ గ్రామంలో 9 రోజుల వ్యవధిలో జరిగిన మూడో ఘటన ఇది. మూడు నెలలుగా అంటే సెప్టెంబర్‌ నుంచి బహ్రెయిచ్‌ జిల్లా గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్ల సమూహం దాడులు నమోదయ్యాయి. ఇప్పటివరకు యూపీ గ్రామాలలో తోడేళ్ల సమూహం 8 మంది చిన్నారులతో పాటు ఓ వృద్ధుడిని పొట్టనబెట్టుకున్నాయి. వీటి దాడుల్లో 32 మంది గాయపడ్డారు. సీఎం యోగి ఆదేశాలతో షూటర్లు ఇటీవల నాలుగు తోడేళ్లను కాల్చి చంపారు. మరికొన్నిటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Scroll to Top