అశ్వాపురం పంచాయతీ ఎన్నికలలో కోడ్ ఉల్లంఘించిన ఉపాధ్యాయ సంఘం పిఆర్ టి యూ..
పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 12.
రాజకీయ పార్టీ అభ్యర్థి కోసం స్పష్టమైన ప్రచారం లేదా మద్దతు ఇవ్వడం ఎన్నికలలో అది కోడ్ ఉల్లంఘన అని నిబంధనలు చెబుతున్నాయి అశ్వాపురం గ్రామపంచాయతీలో బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి చందు నాయక్ పోటీ చేస్తుండగా ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోసం పలు రాజకీయ పార్టీలతో పాటు ఉపాధ్యాయ సంఘం అయినా పిఆర్టియు మద్దతు తెలపడం కూడా కోడ్ ఉల్లంఘనేనని ఆ పార్టీపై మిగతా ఉపాధ్యాయ సంఘాలు అధికార పార్టీ రాజకీయ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది.రోడ్ షోలు, ప్రచార సభలు, పోస్టర్స్ బ్యానర్లు, కమిటీ లేబుల్స్ ఉపయోగించడం వంటి ప్రత్యక్ష రాజకీయ ప్రచారం చేయకూడదని తెలిసిన కూడా ఉపాధ్యాయ సంఘం మద్దతు ఎలా ఇచ్చిందని ఎన్నో ఏళ్లుగా రాష్ట్రస్థాయిలో ఒక మంచి ఉపాధ్యాయ సంఘంగా పేరు తెచ్చుకున్న పి.ఆర్.టి.యు ఉపాధ్యాయ సంఘం గ్రామ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి సర్పంచ్ పోటీలో ప్రచారానికి ఎలా మద్దతు ఇచ్చిందని వారు తీవ్రంగా చర్చించుకుంటున్నారు వీరిపై ఎన్నికల నిబంధన అతిక్రమించిన అనుసారం ఎన్నికల అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారోఅని పలు ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ నాయకులు తదితరులు చర్చించుకుంటున్నారు.*రాజ్యాంగబద్ధంగా ఉపాధ్యాయ సంఘానికి ఉండవలసిన పరిమితులు ఏం చెప్తున్నాయంటే….?* గ్రామ స్థాయిలో సర్పంచ్ పదవికి రాజకీయ పార్టీకి ఉపాధ్యాయ సంఘం పి ఆర్ టి యూ మద్దతు ఇచ్చే విషయంలో భారత రాజ్యాంగం, ఎన్నికల నిబంధనలు మరియు ఉద్యోగ సంబంధి నియమాలు చాలా స్పష్టంగా విధి పరిమితులు ఉన్నాయి.వీటిని తెలుసుకోకపోతే పోలింగ్-కోడ్ ఆప్ అండ్ ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించే ప్రమాదం ఉందని చెప్పవచ్చు.సివిల్ మద్దతు వ్యక్తిగతంగా లేదా అసోసియేషన్ గా రాజకీయాలకు సంబంధించిన అసెంబ్లీస్, సెమినార్లు, సర్వేలు, ప్రజల సమస్యలను చర్చించడం లాంటి సామాన్య రాజకీయ చర్చలు చేయవచ్చు సంఘం సభ్యులకు ఓటు హక్కు, గ్రామ అభివృద్ధి, సురక్షిత పంచాయతీ పాలనా వ్యతిరేక అంశాలను చర్చించడం ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క సమస్యను వివరాత్మక దశలో ఎదుటివారిని ప్రశ్నించే విషయంలో సంఘముగా అడగవచ్చు.కానీ సంఘం పేరుతో కమర్షియల్ ప్రచారం అభ్యర్థి వారు గెలవాలని ప్రత్యేకంగా ప్రచారం చేయడం, ఫండ్ రైజింగ్, కార్యకర్తలను బకాయిలాగా పంపించడం చేయ కూడదు.*కోడ్ ఉల్లంఘన కు దారి తీసిన మైక్ ప్రచారం……* బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చందు నాయక్ పోటీలో ఉండటంతో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల ప్రచార వాహనంలో మైక్ ద్వారా ఎన్నికల ప్రచారంలోఈ పార్టీని గెలుచుకోవండి అంటే ఈసీ నియమాలకు వ్యతిరేఖం అవుతుందనిఅయితే ప్రజల హక్కులు, సర్కార్ పాలసీపై డిబేట్ వంటి సామాన్య రాజకీయ చర్చలకు పరిమితి లేదని సుమారుగా నాలుగు రోజులుగా ప్రచారంలో భాగంగా పిఆర్టియు మద్దతు అని తెలిసిన ముందుగా అనుమతి ఇచ్చిన అధికారులు ఎందుకు చూసుకోలేదని అధికారుల తీరును కూడా తప్పుపడుతున్న పలు ఉపాధ్యాయ సంఘాలు.ఎన్నికల సమయాన్ని పోలింగ్ రోజు వరకు వరకు ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థికి ఒకే నియమాలతో పోటీపడే పరిస్థితి ఉండేలా ఉంటే మంచిదని వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చిన ఏమీ కాదని రాజకీయపరంగా ఉపాధ్యాయ సంఘం ఇలా మద్దతు ఇచ్చి కోడిగుల్లంగించిందని దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో పై అధికారులకు ఎటువంటి వివరణ ఇస్తారు వేచి చూడాలి.