అదే దూకుడు.. అదరగొట్టిన అశోకుడు..
“లింగారెడ్డిగూడెం అశోక్” @ ఉప సర్పంచ్
వార్డు సభ్యుడుగా ఘనవిజయం..
లింగారెడ్డి గూడ ఉప సర్పంచ్ గా ఎన్నిక..
ఎమ్మెల్యే శంకర్ ఆశీస్సులతో ఎగిరిన అశోక చక్రం..
లింగారెడ్డిగూడెం ద్వితీయ పౌరుడిగా అశోక్ కు పట్టం..
( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఆటా నాదే.. వేటా నాదే.. అంటూ రంగంలోకి దిగాడు.. వార్డు సభ్యుడిగా పోటీలో ఉన్నాడు.. మరోవైపు సర్పంచ్ అభ్యర్థికి పూర్తిస్థాయిలో సహకారం అందించి అతని గెలుపుకు కృషి చేశాడు.. తాను కూడా వార్డు సభ్యుడిగా విజయం సాధించి ప్రస్తుతం పల్లె ద్వితీయ పౌరుడిగా ఎన్నికయ్యాడు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అశోక్ ప్రస్థానం ఇది. మొదటినుంచి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అన్ని విధాలా అండగా ఉంటూ నాయకుడిగా తనదైన ముద్ర వేసిన లింగారెడ్డిగూడెం అశోక్ సర్పంచిగా పోటీ చేయాలని ఆలోచించినప్పటికీ గ్రామంలో రిజర్వేషన్ కేటగిరీ కింద ఆ స్థానం ఎస్సీలకు వెళ్లడంతో వార్డు సభ్యుడిగా పోటీ చేశాడు. అభ్యర్థి ఎంసీ రాజుకు అన్ని విధాల సహకరించి అతని గెలుపుకు కృషి చేయడమే కాకుండా వార్డు సభ్యుడిగా విజయం సాధించి భేష్ అనిపించుకున్నాడు. గ్రామ సర్పంచ్ విజయం కోసం చిత్తశుద్ధితో శ్రమించిన అశోకుడిని డిప్యూటీ సర్పంచిగా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు. దీనితో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి..
– లింగారెడ్డిగూడెం అశోక్ లింగారెడ్డిగూడెం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా లింగారెడ్డిగూడెం గ్రామ ఉప సర్పంచ్ “లింగారెడ్డిగూడెం అశోక్” అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని, ఆయన అండతో, సర్పంచ్ పిసి రాజుకు అండగా ఉంటూ గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తనను ఓటు వేసి గెలిపించిన గ్రామ ఓటర్లు, అదేవిధంగా ఉపసర్పంచ్ కావడానికి తనకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులందరికీ, గ్రామ పెద్దలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చెల్లా శ్రీకాంత్ రెడ్డి తదితర మిత్ర బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఉన్నతికి మొదటి నుంచి సహకరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు..
