PS Telugu News
Epaper

ప్రాణం–మరణం మధ్య తేడా చూపించే చిన్న విషయం ఇదే!

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఆయుష్షు ఉండాలే కానీ వెంట్రుకవాసిలో పెను ప్రమాదాలనుంచి తప్పించుకొని బతికి బట్టకట్టవచ్చు అంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది కర్నూలు జిల్లాలో. ఓ ప్రభుత్వ కార్యాలయం పైకప్పు కూలి పోయిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కార్యాలయం లో సబ్ ట్రెజరీ ఆఫీసర్ క్యాబిన్ ల్లో ఒక్కసారిగా పై కప్పు ఊడి పడింది. ఆ సమయంలో ఓ ఫైల్ కోసం సబ్ ట్రెజరి ఆఫీసర్ రఘునందన్ ఏదో పనిమీద బయటకు వచ్చారు. ఆయన తన క్యాబిన్‌నుంచి బయటకు వచ్చిన మరుక్షణం పెద్ద శబ్ధంతో పైకప్పు కూలిపోయింది. ఆ శబ్దం విని ఏం జరిగిందోనని కార్యాలయంలోని సిబ్బంది అంతా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో రఘునందన్ స్పందిస్తూ.. ఈ కార్యాలయం బ్రిటిష్ కాలం నాడు నిర్మించిందని, భవనం శిథిలావస్థలో ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయం భయంగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిల్డింగ్ మరమ్మతులు చేపట్టడం గాని నూతన భవనాన్ని నిర్మించడం గాని చేయాలని కోరుతున్నారు.

Scroll to Top