ఏపీ రాజకీయాల్లో విషాద వార్త… మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
పయనించే సూర్యుడు న్యూస్ :మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి ఏపీ రాజకీయాల్లో విషాదం నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అదే విధంగా 6, 7, 9వ లోక్ సభల్లో లోక్ సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా 1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చివరి వరకు ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన చనిపోయిన విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.ఇదిలా ఉండగా, మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో 1940 సెప్టెంబర్ 11 న జన్మించారు. కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆంధ్ర, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు . అనంతరం రాజకీయాలపై మక్కువతో ఎంట్రి ఇచ్చారు. ఆయన తన రాజకీయ జీవితంలో వివిధ పదవులలో పనిచేశారు. 1980-82 వరకు జాయింట్ సెలెక్ట్ కమిటీ, షెడ్యూల్డ్ కులాలు అండ్ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. 1983 నుంచి 1985 వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా 1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో కూడా పనిచేశారు.