అంబం గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం
…రుద్రూర్, డిసెంబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
: రుద్రూర్ మండలంలోని అంబం బీజేపీ పార్టీ గ్రామ సర్పంచ్ గా కుర్లెపు గంగాధర్ గెలుపొందడంతో,రుద్రూర్ మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ కుర్లెపు గంగాధర్ కు రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు ప్రకాష్ పటేల్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.