నిశ్శబ్దంగా ప్లాన్ చేసిన పెద్ది.. చివరికి స్పీడ్ చూపించాడు!
పయనించే సూర్యుడు న్యూస్ :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ వేగవంతం అయింది. ప్రస్తుతం భాగ్యనగరంలో తాజా షెడ్యూల్ జరుగుతోంది, ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం, ఢిల్లీలో మరో కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ ఢిల్లీ షెడ్యూల్‌తో జనవరి నెలాఖరు నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.